March 25

Titus Chapter 3

NT - Titus

0  comments

Disclaimer: The notes below is provided to all who can use it. You may share the notes with others, you may print the notes, and use it for your study or preaching. However, please do not change or alter the notes in any way or form. If you use the notes, it would be appropriate to give credit to the author. Please do not use pictures provided in the notes for public use without consulting with the author. You may use this email to contact us: contact at bibleprabodhalu dot org


తీతు 3 వ అధ్యాయము

పునర్ సమీక్ష - తీతు 2:15 లో, పౌలు ఈ విధముగా చెప్పాడు, వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారంతో దుర్బోధను ఖండించుచునుండుము. నేన్నేవానిని తృణీకరింపనీయకుము. 

తీతు 3:1 -2 "ఆధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా వుండవలెననియు ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్దపడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు , వారికి జ్ఞాపకము చేయుము."

3వ అధ్యాయము 1 -2  వచనాలలో హెచ్చరించుట అనే అంశాన్ని కొనసాగిస్తున్నాడు. ''ఇవన్నీ జ్ఞాపకము'' చేయుము ఒక ఎనిమిది అంశాలను పౌలు తీతుకు తెలియచేసాడు.

  1. అధిపతులకు లోబడి ఉండాలి 
  2. అధికారములకు లోబడి ఉండాలి 
  3. విధేయులుగా ఉండాలి .
  4. ప్రతి సత్కార్యమునకు సిద్దపడి ఉండాలి .
  5. ఎవనిని దూషింపకూడదు 
  6. జగడమాడని వారుగా ఉండాలి .
  7. శాంతులుగా ఉండాలి .
  8. మనుష్యులందరి యెడల సంపూర్ణ సాత్వీకమును కనుపరచాలి 

''విశ్వాసులకు'' సూచనలు ఇచ్చిన తరువాత, ఇప్పుడు ''మనుష్యులందరి విషయములో'' ప్రత్యేకించి ప్రభుత్వ అధికారులకు విషయములో (అధికారులు, మరియు ఇతరులు) విశ్వాసులు ఎలా ఉండాలో పౌలు తెలియచేస్తున్నాడు. ''అధిపతులు'' మరియు ''అధికారులు'' అనే పదము ప్రత్యేకించి ఎవరైతే సహజముగా ప్రభుత్వములో వున్నారో వారిని సూచిస్తుంది. కాబట్టి, విశ్వాసులు అవిశ్వాసులకు మాదిరిగా ఉండాలనేది పౌలు నొక్కి చెప్తున్నఅంశం (2వ అధ్యాయము లో చెప్పబడిన రీతిగా ఒక సమాజాన్ని ఉద్ద్దేశించి మాత్రమే కాదు). 

"జ్ఞాపకము" - ఇది వర్తమాన కాలములో చెప్పబడ్డ ఆజ్ఞతో  కూడుకున్న వాక్యము అనగా తీతు వారిని నిరంతరముహెచ్చరించేవాడుగా ఉండాలి. వారికి ఈ సంగతులు  అనగా అధికారులకు లోబడి యుండాలని ముందుగానే తెలుసు. అయినప్పటికీ వారికి జ్ఞాపకము చేస్తూనే ఉండాలి.

వారు ''విధేయులు'' గా ఉండాలి మరియు ''ప్రతి సత్కార్యమునకు సిద్దపడి యుండాలి.'' వారికి ఈ సంగతులు నిరంతరము జ్ఞాపకము చేసే వుద్దేశము ఎందుకనగా విధేయులుగా ఉండటానికి మరియు ప్రతి సత్కార్యమునకు సిద్దపడి యుండటానికి. ఎందుకు విధేయులుగా ఉండాలి? ఎందుకంటే:

1) ఇది క్రైస్తవ్యము చెప్తున్న బోధ కాబట్టి, మరియు 2) వారు, అనగా క్రేతీయులు రోమా అధికారము క్రింద వున్నారు. ఏది ఏమైనప్పటికి వారు రోమా అధికారంలో వున్నారని ఈ విషయం నొక్కి చెప్పటం లేదు కానీ సువార్త నిమిత్తము విధేయులుగా ఉండమని చెప్తున్నాడు.

సత్కార్యములు చేయాలి అనగా, ''సువార్త నిమిత్తము ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి అని (1 వ తిమోతి 2:10; 5:10; 6:18; 2వ తిమోతి 2:21; 3:17; తీతు 2:7,14).

మరి క్రైస్తవులను వ్యతిరేకించే అధిపతుల విషయములో ఏమి చేయాలి? అయినప్పటికీ వారు విధేయులుగా ఉండాలి. 

Gordon fee అనే భక్తుడు, ఈ విషయం మీద ఇలా చెప్పాడు: 

ఈ ఆజ్ఞలు ఈ రోజుల్లో వున్న క్రైస్తవులకు అనేకమైన ప్రశ్నలు లేవనెత్తుతాయి :             

మనసాక్షికి వ్యతిరేకముగా కార్యములు చేయమని ఒక వ్యక్తిని అధికారులు బలవంతం చేస్తే అప్పుడు ఏమి చేయాలి (అ.కా 4:19)? క్రైస్తవ్యాన్ని అణిచివేస్తున్న అధికారుల సంగతి ఏంటి? న్యాయ న్యాయసూత్రాలు కఠోరంగా అన్యాయముగా వున్నపుడు అప్పుడు ప్రజాస్వామ్యములో పాలిభాగస్తులుగా ప్రభుత్వానికి అవిధేయత చూపవచ్చా? అయితే ఈ సూచనలు రోమా పత్రిక 13:1-8 వరకు వున్నా వచనాలలో ప్రస్తావించబడ్డాయి .మరియు (పౌలు నాటి కాలాన్ని) అప్పటి సమయాన్ని అనగా క్రైస్తవులకు అనుకూలముగా వున్నా రోజులను సూచిస్తున్నాయి. అధిపతులు మరియు అధికారులు పట్ల ఇటువంటి సానుకూల దృక్పదంతో 1వ తిమోతి 2:2. సంఘానికి వ్యతిరేకముగా దేశము వున్నపుడు (ప్రకటన గ్రంధంలో వలె) కూడా విశ్వాసులు మరణము వరకు లోబడాలి. మరియు వారు మనసాక్షికి విరుద్ధముగా వున్నపుడు వారు పాటించరు కాబట్టి వారు ఖచ్చితముగా ఆలా చేస్తారు (ప్రకటన 6:9 -11;12:11; 13 -14 చూడుము). 

ఈ భాగానికి అదనంగా, NAC ఇలా చెప్పింది: 

బైబిల్ యొక్క బోధ స్పష్టముగా వున్నది అదేమనగా, దేవుని చట్టానికి దేశము వ్యతిరేకముగా వున్నపుడు గుడ్డిగా విధేయత చూపమని బైబిల్ కోరడం లేదు (అ.కా 5 : 29). అయినప్పటికీ క్రైస్తవులు మాత్రమే ''లోబడి యుండాలి'' (ప్రవర్తన లో) మరియు ''విధేయత చూపాలి '' (క్రియాలలొ) అని మాత్రమే కాక ''వారు మంచిది ఏదైనా చేయడానికి సిద్ధముగా ఉండాలి,'' క్రైస్తవులు ప్రతి సత్కార్యమునకు సిద్దపడి ఉండాలి (లేక చేయాలి). (pros pan ergon agathon etoimous einai). ఈ సత్కార్యములు అనేవి కార్యరూపకమయిన (కట్టడలకు విధేయులుగా ఉండుట) క్రైస్తవ బాధ్యతలు సమాజములో పాలిభాగస్తులుగా వుండే వరకు విస్తరిస్తున్నవి. ఈ ఆలోచనలు ''మీరు లోకమునకు ఉప్పయియున్నారు...మరియు మీరు లోకమునకు వెలుగునై యున్నారు ... మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి'' అన్న యేసుక్రీస్తు యొక్క బోధకు అభ్యాసాపూర్వక జీవితముగా వున్నవి (మత్తయి 5:13 -16).

''మనుష్యులందరి యెడల సంపూర్ణమైన సాత్వీకమును కనపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడని వారును శాంతులునై యుండవలెను.''

ఈ వచనంలో (2వ వచనం) అధికారులకు లోబడి యుండుమని మరియు సత్క్రియలు చేయమని వారిని (క్రేతులో వున్న విశ్వాసులు) హెచ్చరిస్తున్నాడు (ఫలితముగా వారి యొక్క సత్క్రియలు క్రైస్తవ జీవితానికి ఒక ఆధారముగా ఉంటాయి).

''ఎవనిని దూషింపవద్దు'' - ఒకరి యొక్క ప్రవర్తనకు హాని చేసే విధముగా లేక గపరిచే విధముగా ఒకరికి వ్యతిరేకముగా మాట్లాడుట. 

''జగడమాడని వారుగా ఉండాలి'' - వివాదాస్పదంగా ఉండకూడదు. మరొక మాటలో చెప్పాలంటే, వారు సమాధానముగా ఉండాలి. 

''శాంతులుగా ఉండాలి'' - దయ కలిగిన వారుగా ఉండాలి.

''ఎల్లపుడు సాత్వీకమును కనుపరచాలి'' - యేసుకూరేస్తూ లో వున్న లక్షణము యిది. ఆయన ఎల్లపుడు సాత్వీకుడుగా వున్నాడు (మత్తయి 1:29, 21:5, 2వ కొరింథీ 10:1). 

ఇవన్నీ చెప్పటంలో పౌలు యొక్క ఉద్దేశము ఏంటి? ఇవన్నీ అభ్యాసము చేయుట ద్వారా సువార్త లేక క్రీస్తు యొక్క బోధలు  మీద చెడ్డ అభిప్రాయము ఉండదు (2:5, 8, 10, 12, 14). 

తీతు 3:3 - "ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములను దాసులమునై యుండి, దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు,  అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి."

ఇక్కడ తీతు మరియు ఇతరుల యొక్క గత జీవితాన్ని పౌలు జ్ఞాపకము చేస్తున్నాడు. ఒకప్పుడు వారి జీవితాలలో ఏ మాత్రం మంచి లేని వారుగా వున్నారు (ఇప్పటి జీవితమునకు వ్యతిరేకముగా వున్న జీవితం). 

2వ వచనంలో చెప్పబడ్డ వారికి అనే పదము 3వ వచనంలో మనము అనే పదముతో అనుసంధానించబడింది.

జ్ఞాపకము చేయుము

  • అధిపతులకు, అధికారులకు విధేయులుగా ఉండాలి
  • లోబడి యుండాలి 
  • సత్కార్యములకు సిద్దపడి యుండాలి 
  • జగడమాడని వారుగా ఉండాలి 
  • శాంతులుగా ఉండాలి 
  • ఎల్లపుడు సాత్వీకమును  కనుపరచాలి

మనము కూడా

  • అవివేకులము 
  • అవిధేయులుము 
  • మోసపోయినవారము 
  • నానా విధములైన దురాశలకును బోగములకును దాసులమునై యున్నాము.

''ఎందుకనగా'' అనే పదము కారణాన్ని తెలియచేస్తుంది. ఎందుకు పౌలు 1 -2 వచనాలు చెప్పాడు? ఎందుకంటే ఒకప్పుడు బయటి వున్న వారి కంటే వారు ఏమి భిన్నముగా లేరు అని చూపించడం ద్వారా క్రేతులో వున్న విశ్వాసులు క్రైస్తవ ప్రవర్తనను చూపించేవారుగా ఉండాలి అని పౌలు తెలియచేస్తున్నాడు (ఒకప్పుడు - అనే పదము ఖచ్చితత్వము లేని సమయాన్ని చూపిస్తుంది).

కాబట్టి ఆ తరువాత అతడు ఈ క్రింద వున్న జాబితాను ఇస్తున్నాడు:

  • అవివేకులము - జ్ఞానము లేకుండుట 
  • అవిధేయులుము - ప్రాధమికంగా దేవునికి (1:16)
  • మోసపోయినవారము - సరైన దిక్సూచి లేని వారము 
  • నానా విధములైన దురాశలుకు బోగములుకును దాసులమునై యున్నాము (గలతి 4:8, 9) 
  • దుష్టత్వమునందును అసూయ యందును కాలము గడుపుచు ఉంటిమి - ఇతరుల పట్ల చెడ్డ తలంపులు కలిగి ఉండటం.
  • అసహ్యులుమై యున్నాము - పూర్తిగా అసహ్యించుకొనబడిన వారము 
  • ఒకని నొకడు ద్వేషించుచుంటిమి - బొత్తిగా ఇష్టం లేకుండుట, అసహ్యముతో, లేక ద్వేషముతో.

ఈ జాబితా ఇవ్వడం లో పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? మానవ స్థితిని పౌలు తెలియచేస్తున్నాడు.    

తీతు 3:4-7 - "మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనపుడు మనము నీతిని, అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృపవలన నీతిమంతులమని తీర్చబడి, నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్దాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను."

4-7 వరకు వున్న వచనాలలో, రెండవ వచనంలో చెప్పబడిన మానవ స్థితికి దేవుని యొక్క స్పందనను పౌలు తెలియచేస్తున్నాడు. 

''మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనపుడు'' - ''ఆయన అనే సర్వనామము ఉండుట ద్వారా ఈ వాక్యము యేసుక్రీస్తును గూర్చి చెప్పబడినదిగా వున్నది. (మొత్తం వాక్యం అంతా యేసుక్రీస్తు గూర్చినదే). 

''అయినప్పుడు''  అనే పదము తేడాను తెలియచేస్తుంది. అలాగే ఈ పదము ఒక నిర్దిష్టమైన సమయాన్ని సూచిస్తుంది అదేమనగా, క్రీస్తు లేక కనికరము అనబడే మన రక్షకుడైన దేవుడు ప్రత్యక్షమైన సమయాన్ని సూచిస్తుంది (కొంతమందికి ఉపయోగపడే అవసరాలను అందించటమే కనికరము అనే క్రియ). 

''మన రక్షుకుడైన దేవుని యొక్క కనికరము మరియు ఆయన ప్రేమ ప్రత్యక్షమైనపుడు'' - మన రక్షకుడైన దేవుని యొక్క కనికరము - ''మానవాళి పట్ల దేవుని యొక్క దయ (ప్రేమ) మరియు ప్రేమతో కూడిన శ్రద్ద."

NIGTC చెప్పేది ఏమనగా, మానవుల పట్ల ప్రేమ మరియు కనికరము అనేవి దేవుడు మన రక్షకుడుగా తన సామర్ధ్యము చొప్పున ఇచ్చేవి. దేవుని యొక్క ఈ వైఖరి అవసరమైన వారికి రక్షణను ఇస్తుంది.

''ఆయన మనలను రక్షించాడు'' - తన యందు ఎవరైతే విశ్వాసముంచారో వారిని దేవుడు రక్షిస్తాడు - ''ఒక వ్యక్తి దేవుని యొక్క రక్షణను అనుభవించేలా చేయడం - 'రక్షించుట.' εὐδόκησεν ὁ θεὸς … σῶσαι τοὺς πιστεύοντας. తన యందు విశ్వాసముంచిన వారిని రక్షించుటకు ...దేవుడు నిర్ణయించుకున్నాడు (1 కొరింథీ 1:21).

ఇది ఒక విధముగా చెప్పాలంటే, మనలను రక్షించుటకు ప్రత్యక్షమైన దేవుని కనికరము యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తుంది.

కాని మన క్రియల ఆధారముగా ఆయన మనలను రక్షించలేదు. కాబట్టి పౌలు ఇలా చెప్తున్నాడు ....

''మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక'' - మనము ఏమైతే చేసామో లేక మన గత కాలపు నీతి క్రియలు (మంచిని చేయడం) అనేవి మన రక్షణకు ఆధారం కాదు (ఎఫెసీ 2:8 -9; ఫిలిప్పీ 3:9; 2వ తిమోతి 1: 9). 

ఈ విషయంలో NAC ఒక గొప్ప మాటను చెప్పింది: ''ఒక వ్యక్తి యొక్క జీవితమును మార్చుటకు మరియు రక్షించుటకు శక్తి కలిగిన దేవుని కృప క్రియల మూలముగా కలిగినది కాదు. కాని క్రియలు అనేవి రక్షణ యొక్క ఫలితాలు మాత్రమే.''

''తన కనికరము చొప్పున'' - మనము ఎందుకు రక్షించబడ్డాము అనే దానికి ఇది ఆధారము. అది ఆయన కనికరము. కనికరము, దయ, జాలి అనే అవసరాలు కలిగిన వారి పట్ల దయ చూపించడం లేక శ్రద్ద చూపించడం.

''పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్దాత్మ మనకు  నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను.'' - స్నానము - "మారు మనస్సును కలుగచేసే స్నానము'' కొంతమంది దీనిని బాప్తిస్మము అని చెప్తారు మరికొంతమంది ఆత్మలో కడుగబడుట అని చెప్తారు. 

''పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారా మరియు పరిశుద్దాత్మ నూతన స్వభావమును కలుగచేయుట ద్వారాను'' అనే దానికి మూడు రకములైన వాదనలు వున్నాయి.

  1. స్నానము అనేది మార్పు చెందుటను (లేక బాప్తిస్మమును) సూచిస్తుంది మరియు పునర్జన్మ అనేది ఆత్మ దగ్గరకు రావడాన్ని సూచిస్తుంది, ఈ రెండు పదాలు కలిపి రెండు విభిన్నమైన వాస్తవాలను సూచిస్తున్నాయి. అవి: స్నానము  ద్వారా అనే మాట పునర్జన్మ అనే పదములో వుంది మరియు నూతన స్వభావము అనేది పరిశుద్దాత్మ వలన బహుమానంగా ఇవ్వబడినది. ఈ రెండు వాస్తవాలు మార్పులోను మరియు నిర్దారణలోను వేరు వేరుగా కనబడుతున్నాయి. (ఇది సంప్రదాయమైన వాదన) లేక మార్పు మరియు ఆత్మలో బాప్తిస్మము (పరిశుద్ధ - పెంతుకోస్తు వాదన). కాని ఈ వాదన వలన కొన్ని నష్టాలు వున్నాయి, పునర్జన్మ మరియు నూతన స్వభావము అనునవి పర్యాయపదములుగా వాడబడినవి మరియు అలంటి ఉద్దేశం చెప్పడానికి ఈ రెండు పదాలు మరల మరల చెప్పబడ్డాయి. 
  2. స్నానము అనేది పరిపూర్ణముగా బాప్తిస్మము అను దానిని మాత్రమే సూచిస్తుంది మరియు రెండు క్రియలను నియంత్రిస్తుంది, అవి '''పునర్జన్మ మరియు నూతన స్వభావము,'' ఇవి రెండు పరిశుద్దాత్మ బాప్తిస్మము ద్వారా కలిగినవి. పరిశుద్దాత్మ బాప్తిస్మము ద్వారా పునర్జన్మ మరియు నూతన స్వభావము అనేవి కలిగినవి అనేది సహజముగా వున్నా వ్యాఖ్యానము. ఇది పౌలు మరియు అతడు ఇచ్చిన సందేశములో గణనీయమైన అర్దాన్ని ఇస్తుంది. పునర్జన్మ మరియు నూతన స్వభావము అనే ఈ రెండు పదములు పర్యాయ పదములుగా కనపడవచ్చు (పరిశుద్దాత్మ వలన నూతన స్వభావము మరియు పునర్జన్మ కలిగినవి) లేక ఒకటి మొరొక మాశమును వివరిస్తున్నట్టుగా కూడా ఉండవచ్చు (పునర్జన్మ సంబంధమైన  స్నానము అనగా పరిశుద్దాత్మ వలన కలిగిన నూతన స్వభావము). పునర్జన్మ మరియు నూతన స్వభావము అనే పదముల మధ్య వున్న సంబంధాన్ని బట్టి ఈ వాదనకు అధికమైన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అయినప్పటికీ పూర్తీ సందర్భము మాత్రం బాప్తిస్మము అనుదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. 
  3. స్నానము అనేది బహుశా బాప్తీస్మమును సూచిస్తుంది అయినప్పటికి ఇది ఆత్మసంబంధమైన పవిత్రతకు పోలికగా వున్నది. మరియు బాప్తీస్మము అనుదానికి ఇది పర్యాయ పదము కానే కాదు. ఈ వచనము యొక్క పూర్తి అర్ధము ఏమనగా పరిశుద్దాత్మ ద్వారా కలిగిన నూతన స్వభావము. అది పరిశుద్దాత్మ ద్వారా కడుగబడుట అనే అంశం నుండి కలిగిన పునర్జన్మ మరియు నూతన స్వభావము. ఇది NIV యొక్క వాదనగ వున్నది (ఎందుకంటే నూతన స్వభావము అనే పదము ముందు ఇతర పదములు ఏవి ప్రస్తావించబడలేదు. ఏది ఏమైనప్పటికి, ఇది పౌలు యొక్క స్వంత వాదనగ వున్నది. ఈ విషయము పౌలు యొక్క సిద్ధాంతాలలో పురిగా కనపడుతుంది. అది ఏమి అనగా క్రైస్తవ ఉనికికి పరిశుద్దాత్ముడే పూర్తి అధికారమును కలిగి వున్నాడు. (1వ కొరింథీ 2:6-16; రోమా 6 -8), ఈ వచ్చానులోనే అది నిర్దారించబడి వున్నది (6 వ వచనము).

పునర్జన్మ మరియు నూతన స్వభావము - పునర్జన్మ అనగా, మార్పు చెందుట అని అర్ధం ''జీవితం పూర్తిగా మార్చబడిన అనుభవము, నూతనముగా జన్మించుట,'' మరియు నూతన స్వభావము అనగా ఒక వ్యక్తి తిరిగి ఆత్మలో జన్మించుట (BDAG, 64). 

పరిశుద్దాత్మ వలన- ఎవరిలోనైతే కార్యము జరిగిందో వారిలో కార్యము జరిగించిన వాడు పరిశుద్దాత్ముడే. రక్షణ అనేది మనుష్యుల ద్వారా కాదు కానీ దేవుని వలన మాత్రమే కలిగినది. క్రైస్తవునిగా మార్చబడుటకు పరిశుద్దాత్ముని యొక్క పని ప్రధానముగా వున్నది. 

ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనమీద సమృద్ధిగా కుమ్మరించెను - దేవుడు పరిశుద్ధాత్మను మన మీద కుమ్మరించాడు (పూర్తి అనుభవమునకు కారకుడు). ఆత్మను కుమ్మరించడం అనే భాష పాత నిబంధన నుండి తీసుకొనబడినది. (యోవేలు 2 : 28 -30 [LXX, 3 : 1 -  2]; మరియు అ.కా 2: 17-18). 

యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా - యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రతినిధిగా వున్నాడు, అందువల్ల మనము అయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవమును గూర్చిన నిరీక్షణకు బట్టి దానికి వారసులమై యున్నాము. ఇది ఉద్దేశాన్ని తెలిపే మాట. అందువల్ల అనే మాట ఉద్దేశాన్ని తెలియచేస్తుంది. 

ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి - ఒక వ్యక్తిని సరిఅయిన సంబంధముతో మరొక వ్యక్తితో కలపడం సరిఅయినదిగా ఉంచడం, లేక సరిఅయిన సంబంధముతో కలపడం. ఉద్దేశపూర్వకంగా, తన కృపను బట్టి ఒక వ్యక్తిని సరి అయినవాడుగా చేయడం.

నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై - అందువల్ల అనే ఉద్దేశాన్ని తెలిపే మాట దీనికి కూడా వర్తిస్తుంది. అందువల్ల లేక కాబట్టి మనము నిత్యజీవమును గూర్చిన నిరీక్షణకు వారసులమయ్యాము.

క్రీస్తు యొక్క కార్యమునుబట్టి, క్రీస్తు ద్వారా, ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో వారందరు నిత్యజీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులవుతున్నారు. మరోసారి ఇక్కడ పౌలు యొక్క శ్రద్ద అంత్యకాల సంఘటనలనుగూర్చినది.

తీతు 3:8 - "ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్దగా చేయుట యందు మనస్సుంచునట్లు నీవిసంగతులనుగూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుష్యులకు ప్రయోజనకరమునై యున్నవి."

"ఈ మాట నమ్మదగినది" - ఏ మాట? 4 - 7 వరకు వున్న వచనాలలో వున్న మాట. ఈ వచనాలలో పౌలు సిద్ధాంతపరమైన అనేక విషయాలను ప్రస్తావించాడు.

తీతు ఈ విషాలు చెప్పాలని పౌలు కోరుతున్నాడు. ఈలాగున అంటే , తీతు ఈ విస్షయాలన్ని దృఢముగా చెప్పాలని పౌలు ఆశిస్తున్నాడు. 

ఎందుక? ఎందుకనగా - వారు దేవుని యందు విశ్వాసముంచారు కాబట్టి (అందరు కాదు, ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచారో) వారందరు సత్క్రియలను శ్రద్దగా చేయాలి (వాటి యందు ఆశక్తి చూపాలి. వాటిని చేయుటకు తమ్మును తాము సమర్పించుకోవాలి [2 : 14]).

మరల సత్క్రియలు అని చెప్తున్నప్పుడు రక్షణ అనేది క్రియలను ఆధారము చేసుకొని కలిగినది కాదు. కానీ సత్క్రియలు అనేవి ఒక వ్యక్తిని నిజమైన క్రైస్తవునిగా చూపిస్తాయి.

"ఇవి మంచివియు మనుష్యులందరికి ప్రయోజనకరమునై యున్నవి" - ఇక్కడ చూపించిన పౌలు యొక్క కోరిక ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనకు సంబందించినది. కావున, అతడు ఇలా చెప్తున్నాడు, ఈ ప్రవర్తన మంచిది మరియు మనుష్యులందరికి ప్రయోజనకరమునై యున్నవి. 

Gordon ఈ విధముగా చెప్తాడు, "మంచిని చేయటం అనేది ఏదైతే ఉందొ అది ప్రజలకు ఉపయోగపడుతుంది, కేవలం వారికి భౌతికంగా ఉపయోగపడటం అని కాదు కానీ ఈ క్రియల ద్వారా వారిని సువార్తకు ఎక్కువగా ఆకర్శించవచ్చు." 

తీతు 3:9 - "అవివేక తర్కములును వంశావళులను కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్ప్రయోజనమును వ్యర్థమునై  యున్నవి గనుక వాటికీ దూరముగా ఉండుము."

1:5 వ వచనంలో నేను నీకాజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా వున్న వాటిని దిద్ది, ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశానికి లేక కారణానికి ఒక ముగింపును ఇక్కడ వున్న 9 - 11 వరకు వున్న వచనాలలో ఇవ్వడం జరిగింది. 

"అవివేక తర్కములను, వంశావళులను, కలహములు, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు దూరముగా ఉండుము" - వాటికి దూరముగా ఉండుట ద్వారా ఈ క్రింది వాటిని విడిచి పెట్టమని పౌలు తెలియచేస్తున్నాడు.

  • అవివేక తర్కములు - అంశము లేని, వ్యర్థమైన మాటలు.
  • వంశావళులు - వంశావళికి చెందిన జాబితాలు (1వ తిమోతి 1:4). 
  • కలహములు మరియు ధర్మశాస్త్రమునకు సంబందించిన వివాదములు - ధర్మశాస్త్రమునకు సంబందించిన తర్కములు మరియు వాగ్వాదములు (1వ తిమోతి 6:4; 2వ తిమోతి 2:14. ధర్మశాస్త్రము అనే పదము ఉపయోగించుట ద్వారా, ఖచ్చితమైన సమస్యను పౌలు తెలియచేస్తున్నాడు. ఈ సమస్యలు హెల్లెనియులైన యూదుల నుండి ఏర్పడినవి.

తీతు 3:10 - "మత భేదములు కలిగించు మనుష్యునికి ఒకటి  రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము."

"విసర్జించుట" - దూరముగా ఉంచుట, తృణీకరించుట.

"మత భేదములు కలిగించు మనుష్యుడు" - అబద్ద బోధలు లేక సిద్ధాంతాలు బోధించే వ్యక్తి (అబద్ద బోధకులను సూచిస్తుంది) లేక విభజనలుకు కారకుడైన వ్యక్తి. 

"ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత" - మొదటిలోనే దూరం పెట్టవద్దు కాని, ఒకటి రెండు సార్లు హెచ్చరిక ఇచ్చిన తరువాత విసర్జించుము. ఇలా చెప్పడంలో గల ఆలోచన ఏమనగా ఒకవేళ అతడు సత్యాన్ని విని, మార్పు చెందవచ్చు. 

ఒకవేళ అతడు మార్పు చెందే అవకాశం ఉందేమో అని తీతు చూడాలని పౌలు కోరుతున్నాడు. అందుచేత ముందుగా హెచ్చరిక ఇవ్వమని కోరుతున్నాడు. 

తీతు 3:11 - "అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు."

ఒకవేళ అతడు వినడానికి సుముఖముగా లేకపోయినట్లయితే, అతడు తప్పిపోతున్నాడు మరియు పాపము చేసే వాడుగా ఉంటాడు. సరిఅయిన ప్రవర్తన నుండి తప్పిపోయి చెడు మార్గములోనికి వెళ్ళిపోతున్నాడు.

పాపము చేయుచున్నాడు అనే క్రియ వర్తమాన కాలములో వ్రాయబడినది. అనగా అర్ధం, ఎవరైతే నిరంతరముగా పాపము చేస్తున్నారో వారు తమకు తామే శిక్ష విధించుకుంటున్నారు. 

తీతు 3:12 - "నికొపొలిలో  శీతాకాలము గడుపవలెనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి న యొద్దకు వచ్చుటకు ప్రయాత్నము చేయుము."

12-15 వచనాలలో పౌలు పత్రికను ముగిస్తున్నాడు. 

12వ వచనంలో అర్తెమానును తుకికును తీతుకు యొద్దకు పంపాలని పౌలు ఉద్దేశించాడు. పత్రిక తీసుకు రావడానికి లేక తీతు స్థానములో క్రేతులో వారిని ఉంచడానికి. కారణము ఏదైనా కావచ్చు, తీతు తన యొద్దకు నికొపొలి రావాలని పౌలు ఆశ కలిగి యున్నాడు. పౌలు అక్కడ శీతాకాలము గడపాలని ఆశపడుతున్నాడు.

ఇక్కడ వున్న వాక్యము పౌలు నికొపొలిలో వున్నట్టుగా చెప్పటం లేదు. 

నికొపొలి - Νικόπολις, Nikopolis- రోమా నగరాలలో ఇది ఒకటిగా వున్నది. ఈ రోజున ఇది Epirus లో వున్న Smyrtoula అనే పట్టణముగా పిలువబడుతుంది. నికొపొలిస్ అనగా, విజయానికి చిహ్నముగా వున్న పట్టణము అని అర్ధం. Adriatic సముద్రానికి, Ambracian గల్ఫ్ కి ఉత్తర దిశగా వున్నది. 

నూతన నిబంధనలో నికొపొలి: 

నికొపొలి అనే పట్టణము తీతు 3:12 లో ప్రస్తావించబడినది. అర్తెమాను మరియు తుకికు రాగానే, నికొపొలిలో వున్న తన దగ్గరకు వచ్చి కలవమని తీతును పౌలు కోరుతున్నాడు. అక్కడ పౌలు శీతాకాలం గడపాలి అనుకున్నాడు. అంటే, పౌలు అప్పటికి నికొపొలి ఇంకా రాలేదు. ఈ మాట పౌలు ఈ పత్రికను బహుశా వేసవి కాలములో వ్రాసి ఉండవచ్చు అని సూచిస్తుంది. ఇది శీతాకాలం సమీపించేసరికి క్రేతు నుండి నికొపొలికి ప్రయాణం చేయడానికి తీతుకు తగిన సమయాన్ని ఇస్తుంది. పౌలు తన సువార్తను పచ్చిమ దిశగా వ్యాప్తి  చేయడానికి నికొపొలి అనే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు.

తీతు 3:13 - "ధర్మశాస్త్రవేదియైన జేనాను, అపొల్లోనును శీఘ్రముగా సాగనంపుము. వారికేమియు తక్కువ లేకుండా చూడుము."  

"శీఘ్రముగా సాగనంపుము, వారికేమియు తక్కువ లేకుండా చూడుము" - ఒక లక్ష్యాన్ని ఛేదించడంలో త్రీవ్రముగ కష్టపడుట. కష్టపడుట, శక్తి కొలది చేయుట. ధర్మశాస్త్రవేదియైన జేనా మరియు అపొల్లోప్రయాణము చేయుటకు తీతుకు శక్తికొలది సహాయము చేయాలి. సహాయము చేయుట అనేది క్రైస్తవ అభ్యాస జీవితమునకు సూచన అనేది కొన్ని వచనాలలో గమనించగలము. అ.కా 15:3, 21:5; రోమా 15:24; 1వ కొరింథీ 16:6; 2వ కొరింథీ 1:16 మరియు 3వ యోహాను 6. ఐతే ప్రత్యేకించి, తీతు వారి యొక్క ప్రయాణము కొరకు సహాయము చేయవలసి వున్నది. (వారి ప్రయాణము కొరకు కావలసినవన్నీ సమకూర్చుట). 

పౌలు సహజముగా ఒకే వ్యక్తిని గూర్చి చెప్పేటప్పుడు అతని యొక్క వృత్తిని కూడా చెప్తాడు. ఉదాహరణకు వైద్యుడైన లూకా అని చెప్పినట్టుగా (కొలస్సి 4:14). 

ధర్మశాస్త్రవేదియైన జేనాను గూర్చి వివరాలు తెలియవు. అపొల్లో మాత్రం సుపరిచితుడు (అ.కా 18:24-19:1; 1వ కొరింథీ 1:12; 16:12). 

ఎందుకు వారి పట్ల శ్రద్ద తీసుకోమని పౌలు చెప్పాడు? తద్వారా వారు కొదువ లేకుండా ఉండటానికి. 

తీతు 3:14 - "మనవారు నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్దగా చేయుటకు నేర్చుకొనవలెను."

మనవారు నేర్చుకొనవలెను - ఎవరైతే క్రైస్తవులుగా వున్నారో లేక ఎవరైతే పౌలుకు మరియు తీతుకు సంబంధించినవారుగా వున్నారో వారు. 

"నేర్చుకొనవలెను" - ఇది వర్తమానకాలంలో వ్రాయబడిన ఆజ్ఞ పూర్వక వాక్యముగా వున్నది. ఒక ఆజ్ఞ, మరియు నిరంతరమూ చేయవలసిన క్రియ; కాబట్టి వారు ఎల్లప్పుడూ నేర్చుకునే వారుగా ఉండాలి సత్క్రియలు చేయుటకు మనస్సు ఉంచే వారుగా ఉండాలి (1వ తిమోతి 2:10, 25; 6:18; తీతు 2:7,14; 3:8, 14), ఆ సత్క్రియలు అనుదిన అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. 

ఐతే, ఎటువంటి అవసరాలు ఉంటాయి? అనుదిన అవసరాల లేక ఒకదాని కొరకైనా ప్రత్యేక అవసరాల ? 8 మరియు 13 వచనాలు అత్యవసరాలును సూచిస్తున్నాయి. 

సత్క్రియల యొక్క ఉద్దేశము ఇక్కడ వ్రాయబడినది. ''నిష్ఫలులు కాకుండు నిమిత్తము'' ఫలించే క్రైస్తవులు ఇతరుల అవసరాలలో పరిచర్య చేసే వారుగా వుంటారు. 

తీతు 3:15 "నా యొద్ద వున్న వారందరు నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టి మమ్మును ప్రేమించువారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికి తోడై యుండును గాక."

ముగింపు వందనములు - నా యొద్ద వున్నవారు అందరు - బహుశా పైన ఎవరి పేర్లు ఐతే ప్రస్తావించబడ్డాయో వారు తీతుకు వందనములు చెప్పారు.

తరువాత విశ్వాసమును బట్టి వారిని ప్రేమించు వారందరికీ వందనములు చెప్పాలని తీతు కోరబడ్డాడు. బహుశా కొంతమంది పౌలు పట్ల, తీతు పట్ల నమ్మకముగా లేని వారుగా ఉండవచ్చు. 

కృప మీ అందరికి తోడై యుండును గాక. దేవుని కృప అందరికి తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ పౌలు ఈ పత్రికను ముగించాడు.                    

Written by Dr. Joel Madasu; Trans. Bro. Samuel Raj.


Tags

#bsn.bibleprabodhalu, New Testament, Titus


You may also like

2 Timothy Chapter 4

2 Timothy Chapter 4

2 Timothy Chapter 3

2 Timothy Chapter 3
>