December 16

The Magnificat: My Soul Magnifies the Lord

General, New Testament, Video

0  comments

The Song of Mary – మరియా యొక్క పాట (Luke 1:39-56).  “నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.”
In English, this is known as The Magnificant. “My soul magnifies the Lord.”

Luke 1:39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి

Luke 1:40 జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.

Luke 1:41 ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను

Luke 1:42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును

Luke 1:43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?

Luke 1:44 ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.

Luke 1:45 ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.

Luke 1:46 అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.

Luke 1:47 ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను

Luke 1:48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.

Luke 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము.

Luke 1:50 ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును.

Luke 1:51 ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.

Luke 1:52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

Luke 1:53 ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

Luke 1:54 అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు

Luke 1:55 ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.

Luke 1:56 అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.

  • The introduction vv. 39-40.
  • The extraordinary event vv. 41 – The baby leaped/moved vigourusly. The baby recognized that the mother of the Savior has arrived.
  • The filling by the Holy Spirit vv. 41. Extraordinary event. 
  • The identity of the child vv. 42
  • The prophecy of Elizabeth vv. 42-45. The pronouncement of how blessed Mary was did not end with the message given by the ange Gabriel. The blessings Mary received because she believed/trusted in God, and she dedicated, surrendered her life to God, are continued here.
  • The Song of Mary vv. 46-55
  • The conclusion vv. 56

Context Analysis

Verses 39-40

Luke 1:39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి Luke 1:40 జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను.

ఆ దినములయందు –  ఏ దినములయందు? గాబ్రియేలు దూత మరియాతో మాట్లాడిన తరువాత. 

మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి – ఈ వూరు ఏదో సరిగా మనకు తెలీయదు. అయినా కానీ స్కాలర్స్ ఏమంటారు అంటే, నజరేతు నుండి యూదా ప్రాంతమునకు వెళ్లి ఉండవోచి అని. అయితే, ఈ ప్రాంతము సుమారు 70 నుండి 100 మైళ్ళ దూరము ఉండొచ్చు. 

ఒకవేళ ఇంత దూరం ఉంటె, మనం గమనించాలి, మరియా చాలా దూరం ప్రయాణించింది. సుమారు 3-4 రోజుల ప్రయాణం. 

మరియొకటి మన గమనించాల్సింది ఏంటంటే, ఒక్కతే అంత దూరం ప్రయాణమా? ఆరోజుల్లో ఒంటరిగా స్త్రీలు బయటకు వెళ్లేవారు కాదు. 

కానీ ఇక్కడ సందర్భాన్ని పట్టి చూస్తే, మరియా, ఒక్కతే, అంత దూరం ప్రయాణించింది. దేవుని దూత నుండి వర్తమానము రావటం అంటే, అది దేవుని దెగ్గరనుంది వచ్చింది అని అర్ధం. ఈ ఆనందంతో, హట్టాతుగా మరియా ప్రయాణం మొదలుబెట్టింది. 

చూడంది లేఖనము ఏమి చెపుతుంది – ఒక ఊరికి త్వరగా వెళ్లి. 

ఎక్కడికి వెళ్ళింది? జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను. – ఎలీసబెతును కలవటానికి, కలిసి ఈ శుభసందర్భాన్ని పంచుకోటానికి. 

Verses 41

Luke 1:41 “ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను.” 

ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే – గ్రంధకర్త మనకు ఈ వర్తమానాన్ని తెలియజేయటానికి ఏమాత్రం కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు. ఏవిధంగా అయితే మరియా త్వరగా ఎలీసబెతు దెగ్గరకు వొచ్చిందో, అదే వేగం ఇక్కడ చూపిస్త ఉన్నాడు. 

ఎలీసబెతు మరియ యొక్క వందనవచనము వినగానే – ఏమి జరిగింది? ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను

బాప్తీస్మము ఇచ్చు యోహాను ఎలీసబెతు గర్భములో ఉన్నాడు. మరియా వందనవచము పలకగానే, ఎలీసబెతు గర్భములో ఉన్న యోహాను గంతులు వెయ్యటం జరిగింది. 

యోహాను పరిశుదాత్మ తో నింపబడతాడని లూకా 1:15-17 లోనే చెప్పటం జరిగింది: 

Luke 1:15 తన తల్లిగర్భ మున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,

Luke 1:16 ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును.

Luke 1:17 మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతి మంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధ పరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనంద మును కలుగును; అతడు పుట్టినందున అనేకులు సంతో షింతురనెను.

ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను – ఇక్కడ ఏమి చూస్తున్నాం? ఎలీసబెతు నోటిలోనుండి మాటలు రాక మునుపే, యోహాను మాట్లాడాడు. ఈ మరియా గర్భములో ఉంది ఎవరో ఆ ఇంకా పుట్టనటువంటి బిడ్డకు తెలుసు – ఈయన లోక రక్షకుడు

40వ లో ఏమని ఉంది? ఎలీసబెతుకు మరియా వందనము చేసెను. 

కేవలము వందనము మాత్రమే చేసింది మరియా. ఇంకా ఎలీసబెతుకు ఏమి చెప్పలేదు. 

ఆ వందనవచనము వినగానే, ఎలీసబెతు గర్భములో ఉన్న యోహాను గంతులు వేసాడు. 

గంతులు వెయ్యటమేకాదు, ఆ గంతులతో పాటు, ప్రవచనము కూడా చేసాడు – తల్లి, ఇదిగో ని ప్రభువు (43) – నా ప్రభువు నాయొద్దకు రావటమా?

ఎంతటి అద్భుతమైన సంఘటన. 

అప్పుడు ఏమి జరిగింది? “అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను …” 

ఇక్కడ ఏమి జరుగుతుంది? మనం, ఒక సంభంధం చూడవొచ్చు. 

ఆమె గర్భంలో తన బిడ్డ కదలికల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి మరియు మరియకు పుట్టబోయే బిడ్డను గూర్చి ఎలీసబెతు బిడ్డ అయినా యోహాను గుర్తింపుకు స్వరం ఇవ్వడానికి పరిశుద్దాత్మ ఆమెను ప్రేరేపించడం గమనిస్తాం.

అంటే, యోహాను ఏమయితే చెప్పాలి అనుకున్నాడో, పరిశుద్దాత్మతో నింపబడిన తన తల్లి చెప్పటం జరిగింది.

Verse 42

Luke 1:42 “స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును.” 

ఇక్కడ ఎలిజాబెతు ప్రవచనం చేయటం మనం చూస్తాం. ఈ ప్రవచనము కూడా ఏమి చెపుతుంది అంటే, గాబ్రియేలు దూత ద్వారా పలికిన మాటలతో అంగీకరించటం చూస్తాం. Luke 1:30 “దూత మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.”

ఇక్కడ ఎలిజాబెతు తన యువ బంధువు యొక్క ఆధిక్యతను గ్రహిస్తుంది, అంగీకరించింది, మరియా యొక్క స్థానాన్ని గ్రహిస్తుంది

“స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు” – ఇది న్యాయాధిపతుల గ్రంధములో యాయేలుకు కూడా ఇవ్వబడిన హెచ్చింపు – Judg. 5:24 “కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెననొందును గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెననొందును.”

“స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు” – ఎందుకు స్త్రీలలో ఆశీర్వదించబడింది మరియా? 

First reason:

తరువాత వాఖ్యభాగం చుడండి – “నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును.” మరియా గర్భములో ఉన్న బిడ్డను బట్టి, ఆమె ఆసిర్వదించబడింది. 

Second reason:

మరియా జీవితము కూడా మనం క్లుప్తంగా చూస్తే, ఈమె దేవునియంది భయభక్తులు కలిగిన స్త్రీ గా , దేవుని వాక్యముని ఎరిగిన స్త్రీ గా, దేవునియందు విధేయత కలిగి జీవించిన స్త్రీ గా మనం నేర్చుకోవొచ్చు. So, ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడినది. 

ఎందుకు ఈ ఆశీర్వాదం అంటే, కేవలం ఆమె జీవిత విధానాన్ని బట్టి మాత్రమే కాదు, ఆమె గర్భములో ఉన్న బిడ్డను బట్టి కూడా. 

Verse 43

ఎలిజాబెతు ప్రవచనం కొనసాగుతుంది – Luke 1:43 “నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?

నేను ఎంతటి దానిని? ఏ పాటి దానిని నా ప్రభువు తల్లి నాయొద్దకు రావటానికి? ఈ పదం – “నా ప్రభువు తల్లి” – ఇది గర్భములో ఉన్న యోహాను పరిశుదాత్మ ద్వారా పలుకుతున్న వాక్కు. 

మరియా గర్భములో ఉంది “నా ప్రభువు.” ఇది యోహాను గ్రహించాడు, యోహాను తల్లి ఎలిజాబెతు కూడా గ్రహించింది. 

గమనించండి ఈ ప్రశ్న – నా ప్రభువు తల్లి నాయొద్దకు రావటమే

ఎంతటి భాగ్యం ఉంటె నా ప్రభువు తల్లి నాయొద్దకు వస్తుంది అని దాని అర్ధం. 

రెండు విషయాలు ఈ వచనం లో మన గమనించాలి:

  1. ఎలిజబెత్ మరియా మాతృత్వానికి ప్రాధమిక స్థానం ఇస్తోంది. ఎందుకంటే, మరియా గర్భం నుండి లోకానికి రక్షణ కలగబోతుంది. 
  2. “నా ప్రభువు తల్లి” – అనే పదాలు ఎలిజాబెతు వాడిది – దీని అర్ధం ఏంటంటే, ఈ పుట్టబోయే బిడ్డకు తన స్వంత సమర్పణను వివరిస్తుంది. 

ఇదే సందర్భం 2 Samuel 24:21 లో కూడా చూస్తాము. – 2Sam. 24:20 “అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుటచూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారముచేసినా యేలినవాడవును రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా” – రాజవునగు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన – నాకు ఏమి స్థానం ఉందని, రాజైన నీవు నావొద్దకు వచ్చావు అని. 

Verses 44-45

Luke 1:44 “ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.” – ఈ వాఖ్యాభాగము రెండొవ మారు ఎలిజాబెతు పలకటం జరిగింది. దీని అర్ధం ఏంటి? ఎలిజాబెతు తన గర్భంలో ఉన్న బిడ్డయొక్క గంతులను ఒత్తిడి చేస్తుంది.  – నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎందుకంటే, ఈ శిశువుకు మరియా గర్భములో ఉన్న బిడ్డ ఎవరో తెలుసు. 

Luke 1:45 “ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.” – 

లూకా యొక్క మొదటి రెండు అధ్యాయాల ప్రధాన అంశము ఏమిటంటే, దేవుడు చెప్పినట్లు చేస్తాడు. ఆ సత్యాన్ని పంచుకునే మరియు విశ్వసించే వారికి వచ్చే ఆశీర్వాదం అధికమైనది. 

మరియొకటి మనము ఏమి నేర్చుకోవొచ్చు అంటే, దేవుడు మన జీవితాల్లోకి అడుగుపెట్టినప్పుడు, ఆయన వాగ్దానం చేసినట్లు చేస్తాడని మనం విశ్వసించాలి మరియు సంతోషించాలి. 

ఆతరువాత  ఏమి జరిగింది?

మరియా స్తుతి పాట పాడటం. 

Verses 46-48

Luke 1:46 “అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.”

ఈమె పేదలు కాదు ప్రభువును ఘనపరిచేది. ఆమె ప్రాణము. సర్వము దేవుణ్ణి ఘనపరుస్తుంది. 

మరియా మాటలను రెండు భాగాలుగా అర్ధం చేసుకోవాలి:

1. ఇది ఒక స్తుతి గీతము – “నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది” – ఇది Latin భాషలో The Magnificant అని అంటారు. ఈ గానం పాత నిభంధనలో హన్నా స్తుతి పాటవాలె ఉంటుంది (1 Samuel 2:1 – “మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహా బలముకలిగెనును, నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను నావిరోధులమీద నేను అతిశయపడుదును.”)

ఈ లూకా సువార్త 1:46-49 లో మనం ఏమి చూస్తాము అంటే, మరియా యొక్క వ్యక్తిగత ఆరాధనా. 

2వ పాయింట్ – దేవుని గూర్చి, ఆయన కార్యాలను గూర్చి మరియా స్తుతులు అర్పించటం. 

  • 46b – ప్రస్తుత కాలం కురించి మాట్లాడతుంది 
  • 47-48a  – గతం గూర్చి మాట్లాడతుంది 
  • 48b  – భవిషత్తు గూర్చి మాట్లాడతుంది. 

46b – ప్రస్తుత కాలం కురించి మాట్లాడతుంది – 1:46b  “నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.” ఆ సమయంలో మరియా దేవుని ఘనపర్చటం. 

47-48ఆ – గతం గూర్చి మాట్లాడతుంది 

Luke 1:47 “ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను” (గతం) Luke 1:48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.

Luke 1:49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను. 

“ఆయన తన దాసురాలి” – దీన స్థితిలో ఉన్న నాపై ఆయన కరుణ చోపించటం. 

48బి – భవిషత్తు గూర్చి మాట్లాడతుంది. 

“గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు (భవిషత్తు). ఆయన నామము పరిశుద్ధము.” – ఇక్కడ భావం ఏంటంటే, దేవునియందు భయభక్తులు కలిగినవారిని దేవుడు ఏవిధంగా చూస్తాడు అన్న భావం. 

Verses 50-55

Luke 1:50 “ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును.” – దేవుని భయపడువారు, ఆయన్ను గౌరవించేవారు దేవునిద్వారా కనికరాము చూస్తారు. 

మరియా చాలా గొప్ప కార్యాలు చేసిందనే, సమాజంలో ఆమెకు మంచి పేరు ఉందనో “అన్నితరములవారును నన్ను ధన్యురాలని” అనరు. ఎందుకు అంటారు అంటే, ఆమె ఒక గొప్ప ఉదాహరణ, దేవునియొక్క కృపయు, కనికరమును అనుభవించిన స్త్రీ గ ఆమె గుర్తింపు పొందుతుంది.  

“ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తర తరములకుండును.” – లూకా వ్రాసింది ఇశ్రాయేలీయులకీనా, అన్యులు కూడా ఆయన దృష్టిలో ఉన్నారు. కాబట్టి, దేవుని భయపడువారందరు దేవునిద్వారా కనికరాము చూపబడతారు.

ఈ స్తుతి కీర్తన, పాత నిబంధన భాషను వాడుతుంది. (Pss. 34:3; 69:30). దేవుడు చేసిన కార్యాలకు ఆయన్ను స్తుతిస్తుంది – Deuteronomy 10:21 – Deut. 10:21 “ఆయనే నీకు కీర్తనీయుడు. నీవు కన్నులార చూచు చుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే.”

యెహోవా దేవుడు ఇశ్రాయేలుకు ఏమి చేసాడో మరియు బాగా తెలుసు – అందుకే అన్నాను, ఆమెకు దేవుని వాక్యము యందు అవగాహన ఉంది అని. 

Luke 1:51 ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను.

Luke 1:52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను

Luke 1:53 ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను.

Luke 1:54 అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాం తమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మనపితరులతో సెలవిచ్చినట్టు

Luke 1:55 ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను.

దీనంతటికి అర్ధం ఏంటి?

దేవుని దయ చివరికి శక్తి, విముక్తి మరియు న్యాయం లో వ్యక్తమవుతుంది. ఈ దయతోనే దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేసాడు. అబ్రాహాముకు మరియు అతని సంతానానికి దయ చూపినందున దేవుడు, తాను ప్రేమిచి, ఎంచుకున్న దేశం మరియు “అతని సేవకుడు” అయిన ఇశ్రాయేలుకు దేవుడు తన దయను గూర్చి సహాయం చేసాడు.

ఈ చారిత్రక సూచన అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు ద్వారా తన ప్రజలకు దేవుని చేసిన నిబంధనకు కట్టుబడి ఉంటాడని గుర్తుచేస్తుంది. 

దేవుడు తన మాటను ఎలా పాటిస్తాడో మరోసారి లూకా నొక్కిచెప్పాడు. 

ఈ సువార్త చదివేటప్పుడు మనకు ఏమి అర్ధం అవ్వాలి అంటే, దేవునికి భయపడేవారికి ఆయన విశ్వాసంగా ఉంటాడు, ఆయన కట్టుబాట్లు ఇజ్రాయెల్ యొక్క సరిహద్దులకు మించి ఉంటాయి. అంటే, ఇజ్రాయెల్ తోనే ఆయన నిబంధన ఆగిపోదు. ఆయనయందు భయపడేవారితో దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. 

దేవుని వైపు తిరిగే వారు ఆయనకు తగిన సమయంలో వారి తరపున తన ప్రేమను, న్యాయాన్ని చూపిస్తారని ఆశించవచ్చు. ఎందుకంటే, లూకా 1:54 ప్రకారము దేవుడు తన వాగ్దానాలను “గుర్తుంచుకుంటాడు.”

Conclusion: Luke 1:56 అంతట మరియ, యించుమించు మూడు నెలలు ఆమెతోకూడ ఉండి, పిమ్మట తన యింటికి తిరిగి వెళ్లెను.

What do we learn from Mary?

Be thankful to God. 

Be humble before God.

Be praising God for the wonderful works He has done in our lives.

By the way, at this time of the passage, Jesus was in Mary’s womb. He will come into this world shortly from that stand point. He is the Savior of this world, the only one who can forgive your sins and offer salvation. 

Trust in God. 


Tags

Luke 1:36-56, The Magnificant, The Song of Mary


You may also like

2 Timothy Chapter 4

2 Timothy Chapter 4

2 Timothy Chapter 3

2 Timothy Chapter 3
{"email":"Email address invalid","url":"Website address invalid","required":"Required field missing"}

Use this Bottom Section to Promote Your Offer

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Ut enim ad minim 

>